Header Banner

ఏపీలో అక్రమ నిర్మాణాలపై కఠిన నిర్ణయం! కొత్త మార్గదర్శకాలు జారీ!

  Thu Feb 27, 2025 18:00        Politics

ఏపీలో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలక శాఖ ఇవాళ(గురువారం) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రకటించారు. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలని సూచించారు. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా చూడాలని సూచనలు చేశారు. భవన నిర్మాణ ప్రణాళిక మంజూరు సమయంలోనే అండర్ టేకింగ్ తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాన్ ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాన్ని తనిఖీ చేయాలని సూచించారు. ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య ధ్రువపత్రం జారీ చేయకూడదని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టపరిచారు. డీవియేషన్ సరిచేసే వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని చెప్పారు. డీవియేషన్ ఉన్న నిర్మాణాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తే చర్యలు ఉంటాయని అన్నారు. నివాసయోగ్య ధ్రువపత్రం ఇస్తేనే తాగునీరు, డైనేజీ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలకు ట్రేడ్, బిజినెస్ లైసెన్సులు జారీ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. జోనల్ ప్లాన్‌లోనూ డీవియేషన్ లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. నివాసయోగ్య పత్రం చూశాకే బ్యాంకులు నిర్మాణాలపై రుణాలు ఇవ్వాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ సూచించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!


మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #illegal #construction #todaynews #flashnews #latestnews